హాట్ హాట్‌గా కెప్టెన్సీ టాస్క్.. ఈ బరిలో గెలిచేది అతడేనా? (వీడియో)

by Hamsa |   ( Updated:2023-11-01 09:11:58.0  )
హాట్ హాట్‌గా కెప్టెన్సీ టాస్క్.. ఈ బరిలో గెలిచేది అతడేనా? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ షో ఆరు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇక బిగ్‌బాస్-7 స్టార్ట్ అయి కూడా చాలా రోజులు అవుతోంది. అయితే లేటెస్ట్ ప్రోమో వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రోజు కంటెండర్లుగా సెలెక్ట్ అయినా అయిదుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారు అన్నది మిగతా కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారు. దీనికి బిగ్ బాస్ ‘ఈ మిర్చి చాలా హాట్ గురు’ అని పేరు పెట్టారు. ఒక కడ్డీకి కొన్ని హాటెస్ట్ మిరపకాయల దండలు తగలబెట్టారు. వాటిని కంటెండర్లుగా ఉన్న అయిదుగురు అంటే ప్రియాంక, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్, సందీప్‌ల మేడలో వేయాలి. ఎవరి మెడలో అయితే ఎక్కువ మిరప మాలలు ఉంటాయో వారు క్యాప్టెన్సీ బరిలోంచి తొలిగిపోతారని బిగ్‌బాస్ చెబుతారు. ఎవరి మెడలో అయితే తక్కువ మిరప మాలలు ఉంటాయో వారు కెప్టెన్ అవుతారు. కెప్టెన్ ని ఎన్నుకునే టాస్క్ కాబట్టి చాలా హాట్ హాట్‌గా నడిచింది ప్రాసెస్.

ప్రియాంక మెడలో భోలే షావలి మిర్చి వేసాడు. ఇద్దరూ కాసేపు అరుచుకున్నారు. శోభా శెట్టి మెడలో రతిక, యావర్ లు మిర్చి మాలలు వేశారు. టేస్టీ తేజ గ్రూప్ పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్ మెడలో మిర్చి మాల వేశాడు. అలాగే అమర్ కూడా లాజిక్ లేని కారణాలు చెప్పి పల్లవి ప్రశాంత్ మెడలోని మిర్చి మాల వేశారు. ఇక గౌతమ్, సందీప్ లకు ఎవరూ వేసినట్టుగా లేదు. కాకపోతే కెప్టెన్ బరిలోంచి పల్లవి ప్రశాంత్ ను తొలగించేశారు. ఇక సందీప్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గౌతమ్ కెప్టెన్ అవుతాడు అని అందరూ అనుకుంటున్నారు. అయితే నిజంగానే గౌతమ్ తన ఆటతో కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.

Advertisement

Next Story

Most Viewed