Bigg Boss-7: వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

by sudharani |
Bigg Boss-7: వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల 7వ సీజన్ కూడా స్టార్ట్ అయి రెండు వారాలు పూర్తి కావొస్తోంది. హౌస్‌లో కంటెస్టెంటస్ మధ్య రచ్చ కొనసాగుతుంది.

తాజాగా, బిగ్‌బాస్ హౌస్‌లోకి ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనుందని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అంబటి అర్జున్ ఈ వీకెండ్‌లో ఇంట్లోకి వెళ్లనున్నాడట. రెండు వారాల హౌస్‌లో ఉన్న వాళ్ల ఆట తీరు, మాట తీరు చూసిన అర్జున్ మైండ్ గేమ్ ఆడతాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంబటి అర్జున్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘నోటిఫికేషన్స్ ఆన్’’ అని పోస్ట్ పెట్టడంతో అర్జున్ బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడు కాబట్టే అలా పెట్టాడని కొంత మంది వాదిస్తున్నారు. మొత్తానికి ఈ వారం అర్జున్ ఇంట్లోకి వెళతాడో లేదో తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి : Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ నుంచి ఒకేసారి ముగ్గురు ఔట్.. ? ఉల్టా పుల్టా ట్విస్ట్ అదుర్స్..!

Advertisement

Next Story

Most Viewed