Bigg Boss Telugu 7 : బిగ్ బాస్‌ షోలో మరో ట్విస్ట్.. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌తో బ్యూటీ ఎంట్రీ..!

by sudharani |
Bigg Boss Telugu 7 :  బిగ్ బాస్‌ షోలో మరో ట్విస్ట్.. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌తో బ్యూటీ ఎంట్రీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. 14 మందితో స్టార్ట్ అయిన ఈ షో.. నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమేట్ కాగా ప్రస్తుతం హౌస్‌లో 10 మంది ఉన్నారు. అయితే.. ఈ సీజన్ ఉల్టా పుల్టాగా ఉంటుందని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న పవర్ అస్త్రాలను తీసుసేసుకున్న బిగ్ బాస్.. వాళ్లని కూడా కంటెస్టెంట్స్‌గానే నిర్ణయించాడు. మొన్నటి వరకు పవర్ అస్త్ర టాస్క్ పెట్టిన బిగ్ బాస్.. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ షురూ చేశాడు.

అయితే.. ప్రస్తుతం హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. కానీ, 10 వారాల ఆట మిగిలి ఉండగా.. టాప్ 5 కంటెస్టెంట్స్ మినహా 7,8 మంది కంటెస్టెంట్స్ కావాల్సిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ 2.0 పేరుతో ఈ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ మరో గ్రాండ్ లాంచ్ చేయనున్నారట. ఈ మేరకు ఈ ఆదివారం హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు ప్రముఖ టిక్ టాక్ స్టార్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నయని పావని అని నెట్టింట టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఈ ఆదివారం షో చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed