Shobha కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న Bigg Boss.. టార్చర్ చేసేలా టాస్కులు!

by GSrikanth |   ( Updated:2023-10-12 16:46:30.0  )
Shobha కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న Bigg Boss.. టార్చర్ చేసేలా టాస్కులు!
X

దిశ, వెబ్‌డెస్క్: సక్సెస్ ఫుల్‌గా ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారం ఆసక్తికరంగా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7. ఆటగాళ్లు, పోటుగాళ్లు టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడుతుండగా.. లగేజ్ కౌంటర్ బాధ్యతలు అర్జున్, అశ్వినికి అప్పగించాడు బిగ్ బాస్. ఆటగాళ్లు అందరికీ కలిపి రోజుకు కేవలం ఏడు వస్తువులు మాత్రమే ఇవ్వాలనే రూల్ ఉండగా.. మేకప్ కిట్ లేక విలవిలలాడుతుంది శోభా శెట్టి.

ఈ క్రమంలోనే వాష్‌రూమ్‌లో ఇంతకు ముందే ఉన్న మాయిశ్చరైజర్‌ను దొంగిలించడంతో.. ఆమెకు పనిష్మెంట్ ఇవ్వమని అర్జున్‌కు చెప్తాడు బిగ్ బాస్. దీంతో మూడు, నాలుగు రోజులు వేసుకున్న టేస్టీ తేజ టీషర్ట్‌ను వేసుకోవాలని శోభకు టాస్క్ ఇస్తాడు. ఆ తర్వాత ఐదు నిమిషాలు పడుకునే సౌలభ్యం తేజకు ఇస్తూ.. ఆ టైమ్ కౌంట్ చేసే బాధ్యతలు శోభకు అప్పగిస్తాడు బిగ్ బాస్. మొత్తానికి ఈ విధంగా మేకప్ కిట్ కోసం శోభను కష్టపెడుతున్నాడు బిగ్ బాస్.

Advertisement

Next Story