- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక మొక్కను చూసుకోలేనివాడు రైతు బిడ్డా ..? Pallavi Prashanth పై Nagarjuna ఫైర్
దిశ, సినిమా: తెలుగులో బిగ్ బాస్ షోకు ఆదరణ పెరుగుతూనే ఉండడంతో నిర్వాహకులు సీజన్ల మీద సీజన్లు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఏడో సీజన్ కూడా మొదలైంది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చి ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్కులతో ఆకట్టుకుంటోంది. అయితే శని, ఆదివారాలు నాగార్జున ఎంట్రీ ఉంటుందనే విషయం తెలిసిందే. కాగా తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ఇంటి సభ్యులకు బాగానే చివాట్లు పెట్టాడు కింగ్. ఈ వీక్ నామినేషన్ సందర్భంగా ప్రశాంత్‌పై అమరదీప్ అరవడంపై మాట్లాడిన నాగార్జున..
‘అతని డబ్బులు అతని ఇష్టం. అతడు ఎవరికైనా ఇచ్చుకుంటాడు నీకెందుకు?’ అని అన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్‌కు కూడా క్లాస్ పీకాడు. ఎందుకంటే.. హౌస్‌లోకి వెళ్లేటప్పుడు పల్లవి ప్రశాంత్‌కు నాగార్జున ఓ మొక్క ఇచ్చారు. కానీ ఈ మొక్కని కాపాడుకోలేకపోయాడు ప్రశాంత్. అది ఆకులు రాలిపోయి, పూర్తిగా ఎండిపోయింది. దీంతో నాగార్జున.. ‘ ఒక మొక్కను సరిగా చూసుకోలేకపోయావు నువ్వు రైతుబిడ్డవా’ అని విమర్శించాడు. దీంతో ప్రశాంత్ ముఖం మాడిపోయింది.