నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. తాలిబన్లే కారణమంటూ

by Shyam |   ( Updated:2021-08-24 01:04:02.0  )
నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. తాలిబన్లే కారణమంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: తాలిబన్ల ప్రవేశం తర్వాత ఆప్ఘనిస్తాన్ సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. గత పదిరోజుల నుంచి తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ లో అరాచకాలు సృష్టిస్తున్నారు. మహిళలు, చిన్నారులు అని బేధం లేకుండా అడ్డు వచ్చినవారిని హతమారుస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిలో బిగ్ బాస్ బ్యూటీ టెలివిజన్ స్టార్ అర్షిఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ తో తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా వెల్లడించారు. నిశ్చితార్ధం ఆగిపోయినా.. తామిద్దరం మంచి స్నేహితులుగానే ఉంటామని చెప్పుకొచ్చింది. ఆఫ్ఠన్‌లోని పరిణామాలే ఈ వివాహా నిశ్చితార్ధం క్యాన్సిల్ కావడానికి అసలు కారణమని తెలియజేసింది.

గత కొన్ని రోజుల క్రితం తన తండ్రి తనకోసం ఓ ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ ని చూశాడని, అతనితోనే తన వివాహం అని చెప్పినట్లు తెలిపిన నటి తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న కారణంగా కుటుంబం నిశ్చితార్థాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్టుగా ఆమె వెల్లడించారు. తమ కుటుంబానికి ఆప్ఘనిస్తాన్ మూలాలు ఉన్నాయని, ఆప్ఘన్ పఠాన్ కు చెందిన తమ కుటుంబం యూసుఫ్ జాయ్ పఠాన్ జాతికి చెందినదని తెలిపింది. అంతేకాకుండా తమ తల్లిదండ్రులకు అక్కడ మూలాలు ఉన్నా భారతీయ పౌరులుగానే జీవిస్తున్నారని, తానూ కూడా భారతీయ పౌరురాలినేనని తెలిపింది. ఆప్ఘన్ కు కోడలుగా వెళ్లడం ఇష్టం లేదని, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తెలిపింది.

Advertisement

Next Story