- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్‌బాస్-4 ఫైనల్ టీం మెంబర్స్ వీళ్లే..?
దిశ, వెబ్‌డెస్క్ :
మరికొన్ని గంటల్లోనే బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌బాస్-4 అలరించనుంది. స్టార్ మా చానల్‌లో ఆదివారం నుంచి బిగ్‌బాస్ 4 సీజన్ ప్రారంభంకానున్నది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే వారి పేర్లు ఇప్పటికే కొన్ని బయటకు వచ్చినా, దానిని కొందరు ఖండించారు. అయితే, మరికొన్ని గంటల్లో ఈ షో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో అందులో పాల్గొనే 15 మంది పేర్లు మరోమారు బయటకువచ్చాయి.
లిస్ట్ ప్రకారం.. దేత్తడి హారిక (యూట్యూబ్ స్టార్), దేవి నాగవల్లి (యాంకర్), గంగవ్వ (యూట్యూబ్ స్టార్), ముక్కు అవినాష్ (జబర్దస్త్ ఫేం), మోనాల్ గుజ్జార్ (హీరోయిన్), అమ్మ రాజశేఖర్( సినీ నృత్యదర్శకుడు), కరాటే కళ్యాణి (నటి), నోయల్(సింగర్), సూర్యకిరణ్ (సినీ దర్శకుడు), లాస్య (యాంకర్), జోర్దార్ సుజాత (యాంకర్), తనూజ పుట్టస్వామి (బుల్లి తెర నటి, ముద్దమందారం ఫేం), సయ్యద్ సోహైల్ (టీవీ నటుడు), అరియానా గ్లోరీ (యాంకర్, జెమిని కెవ్వు కామెడీ యాంకర్), అభిజిత్ (లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా హీరో) ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సినీ నటి సురేఖ వాణి, మెహబూబా దిల్ సే(టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్) పేర్లు కూడా వినిపిస్తున్నాయి.