బిగ్‌బాస్-4లో నాగార్జున త్రిపుల్ ధమాకా..

by Shyam |   ( Updated:2020-08-15 10:51:58.0  )
బిగ్‌బాస్-4లో నాగార్జున త్రిపుల్ ధమాకా..
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ -4వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది. శనివారం బిగ్ బాస్- 4కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఇందులో కింగ్ నాగార్జున మరోసారి యాంకర్‌గా కనిపించబోతున్నాడు.

https://twitter.com/StarMaa/status/1294644965495042051?s=20

దానికి సంబంధించిన స్టిల్స్, గ్లింప్స్‌ను స్టార్ మా మొన్నే చూపించగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో నాగార్జున ట్రిపుల్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఇరుగుపొరుగు వారిళ్లలో జరిగే గిల్లి కజ్జాలను చూసి ఎంటర్ టైన్ మెంట్ పొందుతున్న తాత, మనవడికి మధ్యలో నాగార్జున వచ్చి ఓ సర్ ప్రైజ్ఇస్తాడు. ఇంటి సభ్యులకు అదిరిపోయే ఎంటర్ టైన్ మెంట్ అంటూ బిగ్‌బాస్ 4గురించి ప్రకటిస్తాడు.

అయితే, ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 గతానికి భిన్నంగా ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. అలాగే, అందులో భాగమైన వారిని షో ప్రారంభానికి వారంరోజుల ముందే క్వారంటైన్‌కు తరలించనున్నారు. అంతకుముందు వారందరికీ పూర్తిస్థాయిలో కరోనా టెస్టులు, ఆరోగ్య పరీక్షలు చేశాకే లోనికి అనుమతించనున్నారు. చివరగా, ఈసారి బిగ్ బాస్ సీజన్ కేవలం 10వారాలు మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story