- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాటాసన్స్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట
న్యూఢిల్లీ: టాటా వర్సెస్ మిస్త్రీ కార్పొరేట్ వార్‌లో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి ఎదురు దెబ్బ తగిలింది. మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా నియమించాలన్న నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టు నిలిపి వేసింది. ఈ మేరకు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది.
2016లో మిస్త్రీకి టాటా సన్స్ బోర్డు షాక్ ఇచ్చింది. ఆయన్ని చైర్మన్ పదవి నుంచి తొలగిస్తు బోర్డు నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ నియమాలకు విరుద్దంగా తనను తొలగించారంటూ మిస్త్రీ పోరాటం మొదులు పెట్టారు. ఈ నేపథ్యంలో బోర్డు నిర్ణయం చెల్లదంటూ, మిస్త్రీని మళ్లీ చైర్మన్‌గా నియమించాలంటూ 2019లో ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పుపై టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై స్టే విధిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఈ కేసులో తుది వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.
తాజాగా నేడు ఈ కేసులో చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న,జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యంలతో కూడిన త్రి సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. సైరస్ మిస్త్రీని తొలగిస్తూ టాటా గ్రూపు తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. చట్టంలో అన్ని అంశాలు టాటా గ్రూపు నిర్ణయానికి అనుకూలంగా ఉన్నాయంటూ ధర్మాసనం వెల్లడించింది.