RRR, భీమ్లా నాయక్ మూవీలకు బిగ్ షాక్.. ఇకపై ఏపీలో అవి లేనట్టే..

by srinivas |   ( Updated:2021-11-24 06:11:03.0  )
nani
X

దిశ, ఏపీ బ్యూరో: త్వరలో విడుదల కాబోతున్న ‘ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్‌ మూవీలకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లైంది. ఈ మూవీల విడుదల సందర్భంగా బెన్‌ఫిట్ షోల ద్వారా అత్యధిక కలెక్షన్లు పొందాలనుకున్న మూవీలకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అందుకు అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపడమే కారణం. ఈ చట్టం ద్వారా ఇకపై ఏపీలో నాలుగు షోలు మాత్రమే పడనున్నాయి. అంతేకాదు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్మాల్సి ఉంటుంది అది కూడా ఆన్‌లైన్‌ విధానంలో. సో ఈ నిర్ణయం సినీ ఇండస్ట్రీకి షాక్ అని ప్రచారం జరుగుతుంది. ఇకపోతే ఏపీ అసెంబ్లీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది.

సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును సభలో మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. రోజూ 4 ఆటలు ఉండగా పది నుంచి 12 షోలు వేస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఉన్నారు. బలహీనతలు సొమ్ము చేసుకునే వ్యవస్థను కట్టడి చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆన్లైన్‌లో టిక్కెట్లు అమ్మితేనే దోపిడీ అరికట్టగలమని ప్రభుత్వం భావించిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే షోలు కూడా ప్రభుత్వం నిర్థారించిన సమయంలోనే షోలు ప్రదర్శించాలని సూచించారు.

సినీపరిశ్రమ ప్రభుత్వ నిబంధనలకు లోబడే నడుచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సినిమా చూసేలా మధ్యతరగతి వారి కోసం కొత్త విధానం తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ట్యాక్సులు కూడా పొంతన కుదరడం లేదని.. ఎవరూ టాక్స్‌లు దాచేలా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించకుండా ఉండాలంటే ఆన్ లైన్ విధానం ఒక్కటే మార్గమని తాము భావించినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడే తక్కువ రేటుకు వినోదం.. ప్రభుత్వానికి ట్యాక్స్ ల రూపంలో ఆదాయం సక్రమంగా వస్తుందన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ ప్రభుత్వంపై నిందలు వేస్తే అర్థం ఉంటుంది.. కానీ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం‌పై బురద జల్లడం దురదృష్టకరమన్నారు.

ప్రభుత్వం అప్పుల కోసం ఈ విధానం అని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. బస్సు, రైలు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో తీసుకోవడానికి లేని అభ్యంతరం సినిమా టిక్కెట్లపై ఎందుకో చెప్పాలని నిలదీశారు. అత్యంత సౌలభ్యకరంగా సినిమాను అందుబాటులోకి తెస్తాం. డబ్బులు పోగు చేసుకోవాలని.. అప్పులు తేవాలని ఆలోచన ప్రభుత్వానికి లేదు. క్యూలైన్‌లో నిలబడే అవసరం లేకుండా.. టిక్కెట్లు తీసుకోవచ్చు అని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.

కేజీఎఫ్ హీరోకు సారీ చెప్పిన అమీర్ ఖాన్.

Advertisement

Next Story