మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. సీన్ రివర్స్

by Anukaran |   ( Updated:2021-11-27 21:55:04.0  )
మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. సీన్ రివర్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నేతలు ఆయనపై గాజువాకలోని న్యూపోర్టు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన చేశారు. చంద్రబాబుకి Z+ కేటగిరి సెక్యూరిటీని తొలగిస్తే ఆయనను లారీలతో తొక్కిస్తామంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీంతో మంత్రి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే గాజువాక టీడీపీ సమన్వయకర్త శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు మంత్రి తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మంత్రి నానిపై కేసు నమోదు చేయాలని గాజువాక టీడీపీ కమిటీ ప్రతినిధులు శనివారం రాత్రి న్యూపోర్టు స్టేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. మంత్రి నానికి బూతులు తప్ప ఏమీ తెలియదు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు.. మనిషిగా మారడానికి ట్రై చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఘటన కారణంగా మహిళలు దాడిచేస్తారేమోనని.. కొడాలి నానికి సీఎం జగన్‌రెడ్డి సెక్యూరిటీ పెంచారని విమర్శించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి కొడాలి నానికి లేదన్నారు.

Advertisement

Next Story