- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో కేసీఆర్‌కు భారీ షాక్.. TRSలో చేరి వెన్నుపోటుకు ప్లాన్స్.!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్న హుజురాబాద్‌లో ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులను నీడలా వెంటాడుతున్న ఈ సమస్యను పరిష్కరించుకోవడం ఎలా అన్న అంతర్మథనం కొంతమంది నాయకుల్లో మొదలైంది. పైకి మాత్రం గులాబీ జెండా కప్పుకుంటున్నా లోలోన మాత్రం కమలం వైపు మొగ్గు చూపుతున్న నాయకుల తీరుతో స్థానిక నాయకుల్లో సరికొత్త కలవరం మొదలైంది.
ఓ వైపున రాష్ట్ర ముఖ్యమంత్రి సహా ప్రతీ ముఖ్య నాయకుడు హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరేయాలన్న తపనతో వ్యూహాలు రచిస్తుంటే.. స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. నియోజకవర్గానికి చెందిన మండల స్థాయి నాయకులు తమ సన్నిహితులతో రహస్యంగా సమావేశమై బీజేపీకే మద్దతివ్వాలని సూచించినట్టు టీఆర్ఎస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈటలను వీడి టీఆర్ఎస్‌లో చేరిన కొంతమంది ముఖ్య నాయకులు బీజేపీ గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పార్టీ ముఖ్య నాయకుల వరకూ చేరినట్టుగా తెలుస్తోంది. మొక్కుబడిగా ప్రచారం చేస్తూ బీజేపీకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సంకేతాలను పంపిస్తుండటం టీఆర్ఎస్ పార్టీ అభిమానులకు మింగుడుపడకుండా తయారైంది.
కరవమంటే కప్పకు..
ఉన్నట్టుండి హుజురాబాద్‌లో సీక్రెట్‌గా జరుగుతున్న ప్రచారం గురించి తెలుసుకున్న ముఖ్య నాయకులు కోవర్టులకు చెక్ ఎలా పెట్టాలని స్కెచ్‌లు వేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ నేడో రేపో విడుదల కానున్న నేపథ్యంలో పిడుగు లాంటి ఈ సమాచారం తెలియడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే వారినే డైరెక్ట్‌గా మందలిద్దామంటే వ్యతిరేక ప్రచారం అవుతుందని, వదిలేస్తే ఇంకా రెచ్చిపోతారేమోనన్న యోచనతో ముఖ్య నాయకులు ఆచితూచి అడుగేస్తున్నట్టుగా తెలుస్తోంది. కరవమంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం అన్న సంకట పరిస్థితులు నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారానికి సున్నితంగానే చెక్ పెట్టాలన్న ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.
నిఘా వర్గాల అలర్ట్..
టీఆర్ఎస్‌లో ఉంటూ కోవర్టులుగా వ్యవహరిస్తున్న నాయకుల చిట్టా సేకరించే పనిలో నిఘా వర్గాలు పడినట్టు సమాచారం. ఈటల రాజేందర్ గెలుపు కోసం రహస్యంగా సమీకరణాలు చేస్తున్న వారి గురించి ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.