- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పీఠాధిపతులతో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల రహస్య భేటీ?
దిశ, ఏపీ బ్యూరో: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీపై ఆర్ఎస్ఎస్ కన్ను పడింది. చట్టపరంగా స్వాధీనం చేసుకునేందుకు ఢిల్లీలో పీఠాధిపతులతో సమావేశమైంది. ఇక టీటీడీని భక్తులే కాపాడుకోవాలని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… హిందూ ధర్మ ఆచార్య సభ ద్వారా టీటీడీని, ఆలయాలను, ఆస్తులను, బంగారాన్ని ఆర్ఎస్ఎస్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈ నెల 7న ఢిల్లీలోని ఇండియా ఇంటర్ నేషనల్ సెంటర్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షతన పీఠాధిపతులతో రహస్య సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అందులో 30 మంది బీజేపీ నేతలు పాల్గొన్నట్లు చింతా మోహన్ పేర్కొన్నారు.
చట్టపరమైన అంశాలతో పాటు… ఏం చేయాలనే కార్యాచరణతో వస్తే తాను సహాయం చేస్తానని పీఠాధిపతులకు మోహన్ భగవత్ మాట ఇచ్చినట్లు చింతా మోహన్ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని రెండు సంవత్సరాల క్రితం ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఇప్పుడు టీటీడీ అంశం ప్రారంభమైందన్నారు. రెండేళ్లలో టీటీడీ ఆర్ఎస్ఎస్చేతుల్లోకి పోతుందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. వైఎస్ జగన్ బలహీనమైన సీఎం. కేంద్రం ఆదేశాలను అడ్డుకోలేడని చింతా మోహన్ విమర్శించారు. టీటీడీ ఉద్యోగులు అప్రమత్తమై జాగ్రత్త పడాలని సూచించారు. టీటీడీపై ఆర్ఎస్ఎస్ కుట్రను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. టీటీడీని ప్రజలే కాపాడుకోవాలని చింతా మోహన్ పిలుపునిచ్చారు.
రథ సప్తమి.. దర్శన టికెట్ల కోటా విడుదల