కరోనా సమయంలో బిగ్‌బజార్ ప్రత్యేక ఆఫర్!

by Harish |   ( Updated:2021-05-23 06:08:38.0  )
కరోనా సమయంలో బిగ్‌బజార్ ప్రత్యేక ఆఫర్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రజలకు మెరుగైన ఆఫర్లను అందించేందుకు ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్ విభాగం బిగ్‌బజార్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ‘బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ పేరుతో ఈ నెల 22 నుంచి మే 31 వరకు రూ. 1,500 విలువైన షాపింగ్ చేసిన వారికి రూ. 1,000 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కరోనా నియంత్రణ కోసం అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న కారణంగా బిగ్‌బజార్ కస్టమర్ల కోసం తన షాపింగ్ యాప్‌లో లేదా బిగ్‌బజార్ స్టోర్‌లో ఈ ఆఫర్ అందించనున్నట్టు వివరించింది. బిగ్‌బజార్ ఆన్‌లైన్ యాప్ నుంచి కొనుగోళ్లు జరిపిన వాటికి కూడా రూ. వెయ్యి క్యాష్‌బ్యాక్‌తో పాటు ఆర్డర్ చేసిన 2 గంటల్లోగా హోమ్ డెలివరీ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇంటి నుంచే షాపింగ్ చేయడమో లేదంటే దగ్గరలోని బిగ్‌బజార్ స్టోర్‌లో ఈ ఆఫర్లను పొందవచ్చని’ ఫ్యూచర్ గ్రూప్ డిజిటల్ మార్కెటింగ్ సీఎంఓ పవన్ సర్దా చెప్పారు.

Advertisement

Next Story