డెమోక్రాటిక్ అభ్యర్థిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

by vinod kumar |
డెమోక్రాటిక్ అభ్యర్థిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
X

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉండనుండగా.. ఇక డెమోక్రాట్ల తరపున మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ పోటీ చేయనున్నారు. ఇప్పటికే జో బిడెన్‌కు చైనా వెనకనుంచి సాయం చేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్న క్రమంలో.. తాజాగా బిడెన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువడటం హాట్ టాపిక్‌గా మారింది. సెనేట్ మాజీ స్టాఫర్ తారా రీడే ఆయనపై ఆరోపణలు చేశారు. ‘1990లో బిడెన్ తనను లైంగికంగా వేధించారని చెప్పడంతో అమెరికా రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు అధ్యక్ష అభ్యర్థిపై ఇలా ఆరోపణలు రావడం ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, ఈ ఆరోపణలను బిడెన్ కొట్టి పడేశారు. ‘ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఇది తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టే కుట్రలో భాగమేనని’ ఆయన పేర్కొన్నారు. ‘నేను చాలా స్పష్టంగా చెప్పగలను.. అలా ఎప్పుడూ జరగలేదు’ అని బిడెన్ ఖరాకండిగా చెప్పేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాట్ల తరపున జో బిడెన్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే. అతనికి పోటీగా ఉన్న బెర్నీ శాండర్స్ ప్రస్తుతం బిడెన్‌కే మద్దతు తెలుపుతుండటం విశేషం.

Tags: Joe Biden, Sexual Assault, America, US, Election, Presidential Candidate, Democrat, Tara Reade

Advertisement

Next Story

Most Viewed