- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సుప్రీం కమిటీ నుంచి భూపేంద్రసింగ్ మాన్ లెఫ్ట్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. సమస్యల పరిష్కారానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కమిటీ నుంచి భూపేంద్ర సింగ్ మాన్ తప్పుకున్నారు. రైతుల ప్రయోజనాల కోసమే తాను కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న భూపేంద్ర సింగ్ మాన్ తప్పుకోవడంతో పలు రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ నూతన చట్టాలు రద్దు చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు పట్టుబట్టారు. ఉద్యమ కార్యచరణను మరింత ఉధృతం చేసేందుకు.. జనవరి 26న భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీకి నిర్ణయం తీసుకున్నారు. ర్యాలీ ఎర్రకోటలో కాదని.. ఢిల్లీ సరిహద్దుల్లోనే ట్రాక్టర్ ర్యాలీ ఉంటుందని.. రిపబ్లిక్ పరేడ్‌కు ఎటువంటి ఆటంకం కలిగించమన్నారు. ఇందుకు ప్రతీ ఒక్క రైతు సహకరించాలని.. విచ్ఛిన్నకర శక్తులకు దూరంగా ఉండాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.