అవసరం లేకుంటే దుస్తులు ఎందుకు? : హీరోయిన్

by Jakkula Samataha |
అవసరం లేకుంటే దుస్తులు ఎందుకు? : హీరోయిన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్, క్లైమేట్ వారియర్ భూమి పెడ్నేకర్.. ప్రజలు క్లైమేట్ ఫ్రెండ్లీగా ఎలా ఉండాలో అవగాహన కల్పించడంలో ముందుంటుంది. ‘వరల్డ్ ఎర్త్ డే’ సందర్భంగా ఈ ఫ్రెండ్లీ నేచర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ప్లీవ్డ్ థ్రిఫ్టింగ్ స్టోర్ ‘డోల్చీ వీ’తో కలిసి ఎన్విరాన్మెంటల్ ఫుట్ ప్రింట్ క్యాలిక్యులేటర్‌ను ప్రారంభించింది.

ఇందులో భాగంగా తయారు చేసిన దుస్తులను కొనుగోలు చేసే క్రమంలో అవసరమైన నీరు, వెలువడే కార్బన్ ఉద్ఘారాల గురించిన వివరాలను డిస్‌ప్లే చేయనుంది. ఉదాహరణకు వారు ప్రాసెస్ చేసిన జీన్స్ పెయిర్ తయారీకి 1826 లీటర్ల నీరు అవసరం అవుతుండగా.. ఇది ఒక వ్యక్తి ఏడాదిలో తాగే నీటితో సమానం. అంతేకాదు డ్రెస్ డిజైన్ చేసినప్పుడు వెలువడే కార్బన్ డయాక్సైడ్ లేదా గ్రీన్ హౌస్ వాయువులను నాలుగు కిలోల వరకు తగ్గిస్తుందని తెలిపింది. ఈ పరిమాణం 23 కిలోమీటర్లు కారు నడిపినప్పుడు వెలువడే కార్బన్ ఉద్ఘారాలతో సమానమని చెప్పింది. ఇందుకు సంబంధించిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వివరించిన భూమి.. టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ద్వారా పర్యావరణం తీవ్రస్థాయిలో కలుషితం అవుతున్నందున ప్రజలందరూ అవసరం మేరకే దుస్తులు కొనుగోలు చేయాలని కోరింది. రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా ఉండాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed