అయోధ్యలో భూమి పూజ.. పాల్గొన్న మోడీ

by Shamantha N |   ( Updated:2023-09-01 15:39:52.0  )
అయోధ్యలో భూమి పూజ.. పాల్గొన్న మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో భూమి పూజ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. నిర్మించ తలపెట్టిన రామమందిరానికి ప్రధాని మోడీ పునాది రాయి వేశారు. ఈ సమయంలో రామనామస్మరణతో అయోధ్య మారుమోగింది. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కాగా, ఉదయం ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్న మోడీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు ఘనస్వాగంత పలికారు. అనంతరం యోగితో కలిసి హనుమాన్ గర్హి ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా అయోధ్యకు చేరుకున్నారు. అనంతరం భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story