అయోధ్య రామ మందిరానికి భూమి పూజ.. ఎప్పుడంటే?

by Shamantha N |
అయోధ్య రామ మందిరానికి భూమి పూజ.. ఎప్పుడంటే?
X

దిశ , వెబ్‌డెస్క్: భారత న్యాయస్థాన చరిత్రలోనే ఎన్నో ఏళ్లుగా సాగిన వివాదాస్పదమైన కేసు అయోధ్య భూమి.. రామ మందిరానికే చెందుతుందని గతేడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ మందిర నిర్మాణానికి పనులు ముమ్మరం చేస్తున్నారు. ఆగస్టు 5న మందిర నిర్మాణంలో భాగంగా భూమి పూజ నిర్వహిస్తామని రామ జన్మ భూమి ట్రస్ట్ స్పష్టం చేసింది. కాగా, ఈ పూజా కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించే యోచనలో ట్రస్ట్ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story