- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం
దిశ, వెబ్‌డెస్క్ : పట్టుదల, ఆత్మస్థైర్యం ఉంటే విజయానికి అంగవైకల్యం కూడా అడ్డు రాదు అంటారు. అలా మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన భవీనా.. పోలియో కారణంగా చిన్నప్పటి నుంచి చక్రాల కుర్చీచేకే పరిమితమై నేడు పతకం సాధించి చరిత్ర తిరగరాసింది. నేడు టోక్యోలో పారాలింపిక్స్‌లో భారత్ కొత్త రికార్డు సృష్టించింది. అంగవైక్యలం ఉందని బాధపడకుండా.. పట్టుదలతో శ్రమించింది.. జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన భవీనా చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌కు చేరి పతాకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రోజు జరిగిన గోల్డ్ మెడల్ కోసం జరిగిన పోటీలో ఓటమి పాలయ్యి సిల్వర్ మెడల్ సాధించి అరుదైన ఘటనత సాధించింది. చైనా క్రీడాకారిణి యింగ్ జావాతో భవీనా బెన్ పటేల్ 0-3 తేడాతో ఓడిపోయింది. దాంతో భవీనా రజతంతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.
కాగా, మొన్న బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్‌లో 3-0తో అద్భుత విజయం సాధించి క్వార్టర్స్‌లో భవీనా అడుగు పెట్టింది. ఆ తరవాత భవీనా పటేల్ ప్రపంచ 2 చాంపియన్ రియో ఒలంపిక్స్ స్వర్ణ పతక విజేత రాంకోవిక్ తో జరిగిన పోరులో కూడా విజయం సాధించింది. ఇక ఈ రోజు ఫైనల్స్ లో ఓడినా కూడా భారత్ కు తొలిపతకం అందించి చరిత్ర సృష్టించింది. భవీనా విజయం పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.