బుల్లెట్ బండిపై ‘భవదీయుడు భగత్‌సింగ్’.. రచ్చ షురూ చేసిన పవన్ ఫ్యాన్స్

by Shyam |   ( Updated:2021-09-09 01:29:37.0  )
బుల్లెట్ బండిపై ‘భవదీయుడు భగత్‌సింగ్’.. రచ్చ షురూ చేసిన పవన్ ఫ్యాన్స్
X

దిశ, సినిమా : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్‌ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. ‘గబ్బర్ సింగ్’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్ తర్వాత వీరి కాంబోపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్- ప్రీ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు పవన్ పవర్‌ఫుల్ టైటిల్‌తో వచ్చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్’ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

పోస్టర్‌‌లో స్టైలిష్ బైక్ పై స్టైల్ అండ్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న పవన్ లుక్‌ అభిమానులను ఫిదా చేయగా.. జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ చేతిలో పట్టుకుని కనిపించడం మరింత కిక్ ఇస్తోంది. ఇక ఈ చిత్రం వెండితెరపై చెరగని సంతకం వేయబోతుందన్న మేకర్స్.. కథలో సామాజిక అంశాల ప్రస్తావన ఉండబోతుందన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించనున్న ఆల్బమ్ ది బెస్ట్‌గా ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి టైటిల్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. పవర్‌స్టార్ అభిమానులు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

Advertisement

Next Story