ప్రై‘వేటు’ ఆసుపత్రులకు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..

by Shyam |
ప్రై‘వేటు’ ఆసుపత్రులకు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత ఉందని తెలిపారు. కరోనాపై సీఎం కేసీఆర్ ఏ విధమైన రివ్యూ చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఆసుపత్రులకు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని విమర్శించారు.

ప్రైవేట్ ఆసుపత్రులపై టాస్క్ ఫోర్స్ వేసిన లాభం ఏంటని అన్నారు. గతంలో ప్రతీ వారం టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ విపక్షాలకూ ఇస్తామని చెప్పారు.. అది ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాకు చేస్తున్న వైద్యానికి ఫీజులు ఫైనల్ చేయండి.. జలగల్లా రక్తం పీల్చే ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి అంటూ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed