సీఎం క్షమాపణలు చెప్పాలి -భట్టి విక్రమార్క 

by  |
సీఎం క్షమాపణలు చెప్పాలి -భట్టి విక్రమార్క 
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తిపై ఒక ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణపై ఆమె లేఖలు రాసినా ప్రభుత్వం సరిగా స్పందించలేదని ఆమె వాపోయారు. వైద్య సిబ్బందిని పెంచాలని, బెడ్లను పెంచాలని సీఎంను కోరినట్లు ఆమె తెలిపారు. కాగా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టీఆరెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

గవర్నర్ రాసిన ప్రతీ అంశాన్ని సీఎల్పీ గతంలో చెప్పిందన్నారు. గవర్నర్ వ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం లేదని మండిపడ్డారు. బుద్దిలేని ప్రభుత్వం గవర్నర్‌పై ఎదురుదాడి చేస్తోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. గవర్నర్ ఇక్కడితో వదిలేయకుండా ప్రభుత్వాన్ని గాడిన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ పై అడ్డగోలుగా మాట్లాడిన టీఆర్ఎస్ నేతల తీరును ఖండిస్తున్నామన్నారు. గవర్నర్‌కు అలాగే కరోనా మరణాలపై ప్రజలందరికీ సీఎం క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed