- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్.. ఒక చేతకాని ముఖ్యమంత్రి
దిశ ప్రతినిధి, ఖమ్మం: ప్రత్యేక రాష్ట్రంలో సాగునీటి రంగం పూర్తిగా అధోగతి పాలైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్‌తో భట్టి మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు, నష్టం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యులతో ఆదివారం జూమ్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టును ఎవరూ సందర్శించకుండా పెద్దఎత్తున పోలీసు బలగాలతో ప్రభుత్వం అడ్డుకుంటోందని భట్టి అన్నారు. కల్వకుర్తి లిప్ట్ ఏమైనా నిషేధిత ప్రాంతమా అని భట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రహస్యంగా దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టు జాతి ఆస్థి అన్న ఆయన.. మొత్తం నష్టాన్ని అంచనావేసేందుకు ఒక ప్రత్యేక సాంకేతిక కమిటీని నియమిస్తున్నట్టు చెప్పారు. అంతేకాక సీఎల్పీ సారథ్యంలోనూ ఈ కమిటీ మొత్తం ప్రాజెక్టును పరిశీలించేందుకు ఈనెల 18న కల్వకుర్తి వెళుతున్నట్టు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి సీఎల్పీ నేతగా ఒక లేఖ రాయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
వ్యవసాయం నిర్లక్ష్యం
రైతాంగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ నెల 11న ఖమ్మం జిల్లాలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టామని భట్టి ప్రకటించారు. ఈ మధ్యకాలంలో కురిసిన ఆకాల వర్షాలకు జిల్లాలో వరి, మిర్చి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆయా పంటలు పండించిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. పంటనష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోపోవడం అత్యంత దారుణని అన్నారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలని ప్రభుత్వం నిర్భంధ వ్యవసాయాన్ని అమలు చేసి.. చివరకు సన్నవడ్లు పండించిన రైతులను నట్టేట ముంచారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మద్దతు ధర రూ.2500 ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు. అకాల వర్షానికి పత్తి పంట మొత్తం నాశనం అయిందని.. వారిని కూడా ఆదుకోవాలని అన్నారు. స్వరాష్ట్ర పాలనలో మరింత శక్తివంతం అవుతుందని ఆశిస్తే.. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇది సీఎం కేసీఆర్ చేతగానితనానికి నిదర్శమని అన్నారు. మద్దతు ధర విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని భట్టి చెప్పారు.