- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్‌టెల్ లాభాలు రూ. 759 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: టెలికాం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 759.2 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ. 5,237 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఇక, గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ. 853.6 కోట్ల లాభాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 25,747 కోట్లుగా నమోదైనట్టు, వార్షిక ప్రాతిపదికన ఇది 3 శాతం తగ్గినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మొబైల్ కార్యకలాపాల్లో ఆదాయం తగ్గడంతో కంపెనీ అమ్మకాలు 4.7 శాతం క్షీణించి రూ. 14,079.8 కోట్లకు చేరుకున్నాయి.
ఈ త్రైమాసికంలో భారత్‌లో కంపెనీ కస్టమర్ల సంఖ్య త్రైమాసిక ప్రాతిపదికన 4.2 శాతం పెరిగి 35 కోట్లకు చేరుకుంది. ఇక, కంపెనీ వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) దాదాపు 13 శాతం క్షీణించి రూ. 145 కి చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ. 166గా ఉంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం రూ. 12,583 కోట్లుగా ఉన్నట్టు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. కాగా, ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సోమవారం ఎయిర్‌టెల్ షేర్ ధర 2.3 శాతం తగ్గి రూ. 577.8 వద్ద ముగిసింది.