జులైలో కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు

by Shamantha N |
Bharat-Biotech covaxin
X

న్యూఢిల్లీ: దేశీయ టీకా కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాల డేటా జులైలో అందుబాటులోకి వస్తుందని, అదే నెలలో వాటిని విడుదల చేస్తామని హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. అనంతరం నిపుణుల సమీక్షలను మెడికల్ జర్నల్స్‌లో ప్రచురిస్తామని, ఇందుకు మూడు నెలల కాలం పడుతుందని వివరించింది. అటుతర్వాత థర్డ్ ఫేజ్ ట్రయల్స్ డేటాను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో)కు సమర్పిస్తామని తెలిపింది. ఇది వరకు ప్రకటించినట్టుగానే జులైలో మూడో దశ ట్రయల్స్ ఫలితాలను వెల్లడిస్తామని వివరించింది. సీడీఎస్‌సీవోకు డేటా సమర్పించిన తర్వాత ఫుల్ లైసెన్సర్‌కు దరఖాస్తు చేసుకుంటామని సంస్థ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగాల జాబితాలో కొవాగ్జిన్‌ను చేర్చడానికి భారత్ బయోటెక్ శాయశక్తులు ప్రయత్నిస్తు్న్నది. ఇందుకోసం మూడో దశ ట్రయల్స్ డేటా అవసరముంది. ఇటీవలే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను పోలుస్తూ వచ్చిన అధ్యయనంలో అనేక లోపాలున్నాయని, ఆ అధ్యయనాన్ని నిపుణులు సమీక్షించలేదని సంస్థ వివరించింది.

Advertisement

Next Story