నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు… భైంసా డీఎస్పీ వార్నింగ్

by Aamani |
నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు… భైంసా డీఎస్పీ వార్నింగ్
X

దిశ, ముధోల్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజలు శాంతియుతంగా, నిరాడంబరంగా జరుపుకోవాలని భైంసా డీఏస్పీ నర్సింగ్ రావు అన్నారు. కుభీర్ మండల కేంద్రంలోని పార్డి (బి) గ్రామంలో శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అవాగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

కరోనా విజృంభిస్తున్న తరుణంలో సామూహికంగా కాకుండా ఏవరి ఇంట్లో వారు పండుగలు జరుపుకోవాలన్నారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ కరోనా మహమ్మారి ప్రభలకుండా తగు నియమాలు పాటించాలని సూచించారు. పండుగల రోజు గుంపులు గుంపులుగా తిరిగి ప్రభుత్వాదేశాలను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లఘించి శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story