భద్రాద్రి రామాలయం అరుదైన ఫోటో

by Sridhar Babu |
భద్రాద్రి రామాలయం అరుదైన ఫోటో
X

దిశ, హైదరాబాద్:

ఈరోజు శ్రీరామనవమి పర్వదినం. దేశ వ్యాప్తంగా అందరూ అత్యంత భక్తి పారవశ్యంతో ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. దేశంలోని వాడవాడలా శ్రీ సీతారాముల కల్యాణం చూద్దాము రారండి అంటూ
విన్పించే పాటను ప్రతి ఒక్కరూ చెవులరా ఆలకిస్తారు. భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తోంది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది.ఈ పరిస్థితుల్లో సీతారాముల కల్యాణం ఎన్నడూ లేనట్టుగా అత్యంత సాదాసీదాగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే, భద్రాద్రిలో 300ఏండ్ల క్రితం రాములోరికి హైదరాబాద్ నిజాం స్టేట్ సీనియర్ అధికారులు బహుమతులను అందజేస్తున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్చల్ అవుతుంది. ఈ ఫోటో 1890 ప్రాంతం నాటిదిగా భావిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఇతర సంప్రదాయ బహుమతులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది.

Tags: Bhadrachalam, Ramalayam, rare photo, khammam, nizam, 300 years

Advertisement

Next Story

Most Viewed