- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాయ్ రాజా కాయ్.. ఈమె సంపాదన గంటకు రూ.54 లక్షలు
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో కష్టపడి పనిచేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఈజీ మనీకి బాగా అలవాటు పడుతున్నారు. కొడితే ఒకేసారి గట్టిగా కొట్టాలని ఒక సినిమాలో హీరో వెంకటేష్ చెప్పినట్లుగా ఈ తరం ఆలోచిస్తోంది. రాత్రికి రాత్రే లక్షాధికారులు కావాలని కలలు కంటున్నారు. ఏదైనా జాబ్ చేస్తే లేదా ఇంకేదైనా పనిచేస్తే రాత్రికి రాత్రి లక్షధికారి అవ్వడం అసాధ్యం. అందుకే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బెట్టింగ్‌ల వైపు యువత మొగ్గు చూపుతోంది.
దీనినే అదునుగా చేసుకుని బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు కోట్లకు పడగలెత్తుతున్నారు. కానీ బెట్టింగ్‌లకు బానిసైనవారు మాత్రం డబ్బులు పొగోట్టుకుంటూనే ఉన్నారు. ఈ మధ్య బెట్టింగ్ యాప్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. ఒకప్పుడు బెట్టింగ్‌లంటే మనిషికి మనిషికి మధ్య జరిగేవి. కానీ టెక్నాలజీ రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో బెట్టింగ్ యాప్‌లు కూడా వచ్చేశాయి.
ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.. ప్రపంచంలో జరిగి ప్రతి క్రీడ, ప్రతి మ్యాచ్ మీద బెట్టింగ్ వేసుకోవచ్చు. రూ.50 నుంచి ఎంతమొత్తంలోనైనా బెట్ చేయవచ్చు. దీంతో యువత బెట్టింగ్‌లవైపు వెళుతూ డబ్బులు పొగోట్టుకున్నారు. కానీ బెట్టింగ్ యాప్ యాజమానులు మాత్రం కోటీశ్వరులు అవుతున్నారు.
‘బెట్ 365’ అనే యాప్ యజమానురాలు డెనిస్ కోయెత్స్ గంటకు రూ.54 లక్షలు సంపాదిస్తుందట. రోజుకు దాదాపు రూ.13 కోట్లు ఆమె ఈ యాప్ ద్వారా సంపాదిస్తుంది. సంవత్సరానికి రూ.4 వేల కోట్లకుపైగే ఆమె సంపాదన ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలో బెట్ 365 యాప్ పాపులర్ కావడంతో ఆమె సంపాదన రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.