ప్రెగ్నెంటైన హీరోయిన్ కమ్ ఎంపీ.. నాకు సంబంధం లేదన్న భర్త

by Anukaran |   ( Updated:2021-06-09 02:42:31.0  )
ప్రెగ్నెంటైన హీరోయిన్ కమ్ ఎంపీ.. నాకు సంబంధం లేదన్న భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగాల్ లో 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికలను హాట్ టాపిక్ గా మారేలా చేసిన హీరోయిన్ నుస్రత్ జహాన్. బెంగాల్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ 31 ఏళ్ల హాట్ బ్యూటీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ షాక్ కి గురిచేసింది. ఎంతో ధీటైన రాజకీయ నాయకులను సైతం ఓడించి లోక్ సభలో అడుగుపెట్టి శభాష్ అనిపించుకున్న నుస్రత్ తన వైవాహిక జీవితాన్ని మాత్రం సక్రమంగా కొనసాగించలేకపోయింది. 2019 లో వ్యాపార వేత్త నిఖిల్ జైన్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్న నుస్రత్ రెండేళ్లు కూడా గడవకముందే అతనితో విడిపోవడానికి సిద్దపడింది.

ఇక గత ఆరు నెలల నుండి నిఖిల్ జైన్, నుస్రత్ విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే నుస్రత్ ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి అని తెలుస్తోంది. అయితే ఈ విషయం భర్త నిఖిల్ జైన్ కి తెలియకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా లో వస్తున్నా వార్తలపై తాజాగా నిఖిల్ స్పందిస్తూ.. నుస్రత్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, తాము ఆరునెలల నుండి విడిగానే ఉంటున్నామని తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయాలపై నుస్రత్ ఇప్పటివరకు నోరు మెదపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా నుస్రత్ జహాన్ బెంగాలీ నటుడు, బిజెపి నాయకుడు యశ్ దాస్‌గుప్తాతో రిలేషన్‌లో ఉన్నట్లు పుకార్లు వస్తున్న విషయం తెల్సిందే. మరి ఈ విషయమై ఈ హాట్ బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Next Story