రిక్షా డ్రైవర్ ఆఫర్.. అతని ప్రశ్నలకు ఆన్సర్ చెప్తే ఫ్రీ రైడ్…

by Shyam |
రిక్షా డ్రైవర్ ఆఫర్.. అతని ప్రశ్నలకు ఆన్సర్ చెప్తే ఫ్రీ రైడ్…
X

దిశ, ఫీచర్స్: దేశవ్యాప్తంగా పాజిటివ్ మైండ్‌సెట్, ఇన్‌స్పైరింగ్ పర్సన్స్ స్టోరీలను పంచుకునేందుకు సోషల్ మీడియా సరైన ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతోంది. ఇక్కడ షేర్ చేసే సాధారణ వ్యక్తుల కథనాలు చాలా మందిలో స్ఫూర్తిని నింపుతున్నాయనడంలో సందేహం లేదు. కాగా పశ్చిమ బెంగాల్‌, హౌరాకు చెందిన ‘ఈ-రిక్షా’ పుల్లర్ సురంజన్ కర్మాకర్ కూడా అలాంటి కోవకు చెందినవాడే. తన తెలివితేటలు, జనరల్ నాలెడ్జ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే ఆయన.. అతను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఫ్రీ రైడ్ ఆఫర్ చేస్తున్నాడు. తాజాగా అతని రిక్షా లో ప్రయాణించిన సంకలన్ సర్కార్ అనే వ్యక్తి.. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిశానంటూ సురంజన్ గురించి ఫేస్‌బుక్‌‌లో ఓ పోస్ట్ పెట్టడంతో అది వైరల్ అయింది.

‘ఈ-రిక్షా లో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ సురంజన్ తమ వైపు తిరిగి, తను అడిగే 15 జనరల్‌ నాలెడ్జ్ క్వశ్చన్స్‌కు సమాధానం చెప్పగలిగితే చార్జి వదిలేస్తానన్నాడు. ఈ మేరకు తమను పశ్చిమ బెంగాల్‌కు మొదటి ముఖ్యమంత్రి ఎవరు? తదితర ప్రశ్నలు అడిగాడు’ అని ఫేస్‌బుక్ యూజర్ సర్కార్ వెల్లడించాడు. ఇక సురంజన్ ఆరో తరగతిలోనే స్కూల్ డ్రాపౌట్ అయినప్పటికీ ప్రతీ విషయంపై నాలెడ్జ్ పెంచుకోవడాన్ని మాత్రం ఆపలేదు. లిలుహ్ బుక్ ఫెయిర్ ఫౌండేషన్ సభ్యుడు కూడా అయిన సురంజన్.. తాను హిందూ, ఇస్లాం రెండు మతాలను అనుసరిస్తున్నట్లు తెలియజేసేలా ఇస్లాం స్కల్ క్యాప్‌ను కూడా ధరిస్తాడు.

ఇక సురంజన్‌ను స్పెల్‌బైండింగ్‌గా పేర్కొంటూ.. కొత్త విషయాలు నేర్చుకోవాలనే అతని తపన పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు 2018లో ‘సమస్తిపూర్ టైమ్స్’ అనే యూట్యూబ్ చానల్.. ఆయన లైఫ్ స్టైల్ గురించి వీడియోను కూడా షేర్ చేసింది.

Advertisement

Next Story