- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొకైన్ స్మగ్లింగ్ చుట్టూ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం
దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీని పక్కన పెట్టేసి.. తాము గద్దెనెక్కాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ వ్యూహాలు ఆ పార్టీ నేతల తీరుతో చిత్తవుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి పశ్చిమ బెంగాల్ రాజకీయాలు. ఈ ఏడాది ఏప్రిల్ – మే నెలలో పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని దీదీ ప్రయత్నాలు చేస్తుంటే.. దీదీ ని నిలువరించాలని కమలం నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మురం చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఎత్తుకు పై ఎత్తేస్తున్నారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా దీదీ గెలుపు ఖామయని సీఎన్‌ఎక్స్, ఏబీపీ ఆనంద నిర్వహించిన పబ్లిక్ ఒపినియన్ సర్వేలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. తాజాగా స్మగ్లింగ్ అంశం వెలుగులోకి రావడం తృణముల్ కాంగ్రెస్ నేతలు బీజేపీని మరింత కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మత్తు పదార్ధాల స్మగ్లింగ్ కేసులో బీజేపీ మహిళా నేత అరెస్ట్ అయ్యారు. కోల్ కత్తాకు చెందిన బెంగాల్ బీజేపీ యువ మోర్చా జనరల్ సెక్రటరీ పమేలా గోస్వామి, ఆమె స్నేహితురాలు ప్రబీర్ కుమార్ శుక్రవారం సాయంత్రం అలిపోర్ అనే ప్రాంతానికి చెందిన ఎన్ ఆర్ ఎవెన్యూ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న గోస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె ప్రయాణిస్తున్న వెహికల్లో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో లక్షల విలువైన కొకైన్ ను కారు సీటు కింద, పమేలా పర్స్ లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో గోస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేలా యాక్టింగ్ చేశారు. కేకలు వేశారు.
ఈ సందర్భంగా బీజేపీకి చెందిన సామిక్ భట్టాచార్య మాట్లాడుతూ ‘చట్టం తన పనితాను చేసుకుంటూ వెళుతుంది. కారులో కొకైన్‌ను ఎవరైనా పెట్టారా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంగించినట్లవుతుంది. పోలీసులు రాష్ట్ర నియంత్రణలో ఉన్నారు. ఏదైనా జరగవచ్చు” అంటూ తృణముల్ కాంగ్రెస్ ను ఇన్ డైరెక్ట్ గా విమర్శించారు.
సామిక్ భట్టాచార్య వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు చంద్రీమా భట్టాచార్య మాట్లాడుతూ ‘ బెంగాల్‌లో ఇలాంటివి జరగడంపై నేను సిగ్గుపడుతున్నాను.రాష్ట్రం లో బీజేపీ నేతల తీరుకు ఇదే నిదర్శనం. గతంలో బీజేపీకి చెందిన పలువురు నేతలపై పిల్లల అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు గుర్తు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఎస్ గోస్వామి మరియు ప్రబీర్ ఓ కేఫ్ కు పదే పదే రావడం. ఆ సమయంలో వచ్చిన యువకులతో లావాదేవీల గురించి మాట్లాడుకోవడాన్ని గుర్తించినట్లు తెలిపారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్న చెప్పిన పోలీసులు.. ఆమె కారులో సోదాలు చేయగా డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
ఎయిర్ హోస్టెస్, మోడల్
ఎంఎస్ గోస్వామి 2019 లో బీజేపీ లో చేరడానికి ముందు ఎయిర్ హోస్టెస్, మోడల్, సీరియల్ యాక్టర్ గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫేమ్‌తో బీజేపీ అధిష్టానం ఆమెను యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా మరియు హుగ్లీ జిల్లాకు యువ మోర్చా పరిశీలకురాలిగా నియమించింది.