అర్ధరాత్రి ఉద్రిక్తత.. ‘డబుల్’ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఆందోళన

by Shyam |
Beneficiary protest, double bedroom houses
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిరాశ్రయులు ఎవరూ ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఇండ్లను పక్కా పేదలకు, నిరాశ్రయులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం విధిగా పెట్టుకున్నా.. అక్కడక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు వాళ్లకు సంబంధించిన వారికి ఇప్పించుకోవడం వంటివి జరుగుతున్నాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బాలాజీనగర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలాజీనగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు కొందరు తాళాలు వేశారు. గమనించిన స్థానిక పేదలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముందుగా స్థానికులకే ఇండ్లు కేటాయించాలని ఇండ్ల ఎదుట బైటాయించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు బాలాజీనగర్ చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story