కరోనా మృతులకు శవపేటిక బెడ్

by vinod kumar |
కరోనా మృతులకు శవపేటిక బెడ్
X

కరోనా వైరస్ చనిపోయిన వారిలో కూడా బతికే ఉంటుందని, అందుకే ముందు జాగ్రత్త కోసం ఆ వ్యాధి సోకకుండా శవాలకు కూడా టెస్టులు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఎంత కరోనాతో చనిపోయినా వాళ్లు కూడా మనుషులే.. ఏదో ఒక కుటుంబానికి చెందినవారే. వారికి కూడా తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఉంటారు. కానీ వైరస్ భయంతో దగ్గరికెళ్లి ముట్టుకోలేని పరిస్థితి. ఇక అమెరికా, ఇటలీ వంటి దేశాల్లోనైతే శవాలను గుట్టలు గుట్టలుగా పోసి సామూహిక ఖననాలు చేస్తున్నారు. ఇదంతా చూసిన కొలంబియా వ్యాపారవేత్త రొడాల్ఫో గోమెజ్‌ కూడా మనలాగే మానసిక వేదనకు గురయ్యారు. ఇలాంటి సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపించాలనుకున్నారు. దీంతో ఆస్పత్రి పడకలనే శవపేటికలుగా మార్చి శవపేటిక బెడ్‌లను రూపొందించాడు.

చూడటానికి మామూలుగానే ఉండే ఈ శవపేటిక బెడ్‌ను లోహపు రెయింగ్స్‌తో తయారుచేశారు. కింది భాగంలో బ్రేకులతో కూడిన చక్రాలు ఉంటాయి. ఇది 150 కిలోల బరువును మోయగలుగుతుంది. అంతేకాకుండా ఇవి బయోడీగ్రేడబుల్ కూడా. అందరికీ అందుబాటులో ఉండేలా 92 నుంచి 132 డాలర్ల ధరకే వీటిని అమ్ముతున్నారు. కొలంబియాలోని లెటీసియాలో ఉన్న ఓ ఆస్పత్రికి ఈ శవపేటిక బెడ్లను మొదట విరాళంగా ఇచ్చారు. అక్కడ అందరూ ప్రశంసించడంతో బొగోటాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో నెలకు 3 వేల బెడ్ల చొప్పున తయారు చేస్తున్నామని రొడాల్ఫో తెలిపారు. కొలంబియా, ఈక్వెడార్‌లతో పాటు పెరూ, మెక్సిక్‌, చిలీ, బ్రెజిల్‌, యూఎస్‌కు వీటిని ఎగుమతి చేసేందుకు వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed