తిరుమలలో ఎలుగుబంటి హ‌ల్‌చ‌ల్‌

by srinivas |
తిరుమలలో ఎలుగుబంటి హ‌ల్‌చ‌ల్‌
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో వన్య జీవులు నిత్యం సంచరిస్తూ ఉంటాయి. కాలినడకన వెళ్లే భక్తులకు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఇటీవల ఓ చిరుత రోడ్డుపై వెళ్లే వాహనదారులపై దాడి చేసిన విషయం విదితమే. కాగా మంగళవారం సాయంత్రం తిరుమల ఔటర్ రింగ్ రోడ్డుపై ఎలుగుబంటి దర్శనమిచ్చింది.

రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న విజిలెన్స్ సిబ్బందికి… ఎలుగుబంటి తారసపడింది. అది నేరుగా పెట్రోలింగ్ వాహనం వద్దకే రావడంతో వాహనాన్ని ఆపిన సిబ్బంది దానిని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేసారు. మెల్లగా వాహనాన్ని దానివెంటే నడుపుతూ అడవిలోకి మళ్లించారు.

Advertisement

Next Story