యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్?

by Shyam |
యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్?
X

దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ‌పై ఊగిసలాటకు బీసీసీఐ తెరదించనున్నదా? ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో బీసీసీఐ డీల్ కుదుర్చుకుందా అంటే అవుననే సమాధానం వస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఐపీఎల్, ఆటగాళ్ల శిక్షణ నిమిత్తం పెద్ద ప్రణాళికను బీసీసీఐ సిద్ధం చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే యూఏఈలోనే ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళిక శుక్రవారం నాటి అపెక్స్ కమిటీ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది. బీసీసీఐ రూపొందించిన ప్రణాళిక గురించి బోర్డు అధికారి ఒకరు టూకీగా వివరించారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదా నిర్ణయం ప్రకటించిన వెంటనే ఐపీఎల్ 2020 షెడ్యూల్ ప్రకటిస్తారు. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో ఐపీఎల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు మూడో వారంలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు 35మంది యూఏఈకి వెళ్లనున్నారు. వీరందరికీ అక్కడ నాలుగు వారాల శిక్షణ ఉంటుంది. అనంతరం ఐపీఎల్‌లో ఆడతారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తారని బీసీసీఐ అధికారి తెలిపారు. శిక్షణ, ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed