జేకేసీఏ బాధ్యతలు తీసుకున్న బీసీసీఐ

by Shiva |
జేకేసీఏ బాధ్యతలు తీసుకున్న బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : జమ్ము అండ్ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జేకేసీఏ)కు ఎన్నికలు నిర్వహించి కొత్త బాడీని ఎన్నుకునే వరకు దాని బాధ్యతలు బీసీసీఐ పర్యవేక్షించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జేకేసీఏకు గత కొన్నేళ్లుగా ఎన్నికలు నిర్వహించలేదని.. సదరు అసోసియేషన్‌లో పారదర్శకమైన పాలనకోసం కొత్త కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేయాలని ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఎన్నికలు జరిగే వరకు దాని బాధ్యతలు బీసీసీఐకి అప్పగించింది.

గతంలో ఏర్పాటు చేసిన కోర్ట్ అపాయింటెడ్ అడ్మినిస్ట్రేటర్ల వ్యవస్థన రద్దు చేసి.. పూర్తి బాధ్యతలు బీసీసీఐకి అప్పగించింది. జమ్ము అండ్ కశ్మీర్‌తో పాటు లధాక్ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్దికై బీసీసీఐ చర్యలు తీసుకోవాలని.. జేకేసీఏకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికల నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. జేకేసీఏ పరిధిలో క్రికెట్ సాధనకు అంతర్జాతీయ స్థాయి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాల్లోపేర్కొన్నది. నూతన బాడీ ఎన్నికైన తర్వాత పూర్తి అధికారాలు దానికి బదలాయించాలని బీసీసీఐని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed