బీసీసీఐపై పన్నుల భారాన్ని తగ్గించనున్న ఐసీసీ

by Shyam |
బీసీసీఐపై పన్నుల భారాన్ని తగ్గించనున్న ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ కప్, చాంపియన్స్ లీగ్ వంటి మెగా ఈవెంట్లను నిర్వహించడం వల్ల బీసీసీఐపై పడుతున్న భారీ పన్నుల భారం నుంచి ఐసీసీ కాస్త ఉపశమనం కలిగించనున్నది. 2016లో నిర్వహించిన టీ20 వరల్డ్ కప్, 2023లో నిర్వహించనున్న వన్డే వరల్డ్ కప్ వల్ల బీసీసీఐపై రూ. 750 కోట్ల పన్ను భారం పడింది. ఒక వేళ ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ కనుక ఇక్కడే నిర్వహించి ఉంటే ఈ భారం మరింతగా పెరిగేది. వరల్డ్ కప్ సహా ఐసీసీ ఈవెంట్లు నిర్వహిస్తే ఇతర దేశాల్లో ఆయా ప్రభుత్వాలు భారీగా పన్ను రాయితీలు ఇస్తున్నాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఎలాంటి రాయితీలు అందజేయడం లేదు.

ఈ విషయంపై బీసీసీఐ పలు మార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో బీసీసీఐ భారీగా పన్నులు చెల్లిస్తున్నది. ఇదే విషయాన్ని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. తమ దేశంలో మెగా ఈవెంట్ల నిర్వహణకు ఎలాంటి పన్ను రాయితీలు ఉండవని.. అది తమపై భారంగా మారుతుందని చెప్పింది. రాబోయే సైకిల్‌లో మూడు మెగా ఈవెంట్లు నిర్వహించడం వల్ల ఈ భారం మరింతగా ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో బీసీసీఐపై పడే పన్నుల భారంలో 10 శాతం భరించడానికి ఐసీసీ ఒప్పుకున్నది. దీంతో బీసీసీఐకి రూ. 1500 కోట్ల మేర భారం తగ్గనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed