ఈసారి ఐపీఎల్ టీమ్స్‌కు భారీ రేట్లు: నెస్ వాడియా

by Shyam |
Nes-Wadia21
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 నుంచి రాబోయే కొత్త జట్ల కోసం పోటీ భారీగానే కనపడుతున్నదని.. బీసీసీఐ పెట్టిన బేస్ ప్రైజ్ కంటే 50 నుంచి 75 శాతం ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా అన్నారు. అక్టోబర్ 25న కొత్త జట్ల కోసం వేసిన టెండర్లను తెరవనున్నారు. బీసీసీఐ కొత్త జట్ల కనీస ధర రూ. 2000 కోట్లుగా నిర్ణయించింది. అయితే నెస్ వాడియా అంచనా ప్రకారం ఒక్కో జట్టు రూ. 3000 కోట్ల నుంచి రూ. 3500 కోట్ల వరకు ధర పలకే అవకాశం ఉన్నది. ‘ఐపీఎల్‌లో కొత్తజట్ల ద్వారా బీసీసీఐ భారీగా ఆదాయం సంపాదించే అవకాశం ఉన్నది. అంచనా వేసిన దానికంటే ఎక్కువే రావొచ్చు. మరోవైపు మెగా వేలం జరుగబోతున్నది. అప్పుడు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం ఉన్న ప్లేయర్లలో ఎవరిని రిటైన్ చేసుకోవాలో తెలియని అయోమయంలో ఫ్రాంచైజీలు ఉన్నాయి. కాబట్టి రిటెన్షన్ చేసుకునే ప్లేయర్ల సంఖ్య పెంచాలి’ అని నెస్ వాడియా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed