- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఐదు నగరాల్లోనే ఐపీఎల్..?
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ వేదికలపై ఇంకా సందిగ్దత నెలకొన్నది. కరోనా కారణంగా గత ఏడాది లీగ్‌ను యూఏఈకి తరలించారు. కానీ, ఈ సారి ఇండియాలోనే మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. మినీ వేలం సమయంలో స్పాన్సర్ల గురించి ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వివరాలు వెల్లడించినా.. వేదికలపై స్పష్టతనివ్వలేదు. ఆ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా వేదికలపై ఎలాంటి సమాచారం లేకుండానే వేలం పాట నిర్వహించారని వ్యాఖ్యానించాడు. తాజాగా బీసీసీఐ ఐదు వేదికలను ఐపీఎల్ కోసం నిర్ధారించినట్లు సమాచారం. ఈ వేదికల్లోనే ఐపీఎల్ నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
ఏమిటా ఐదు వేదికలు?
ఐపీఎల్ 14వ సీజన్ కోసం బీసీసీఐ ఐదు వేదికలను ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. ఈ సారి ‘కారావాన్’ స్టైల్‌లో లీగ్ నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా భావిస్తున్నది. ఏ రాష్ట్రం లేదా నగరం క్రికెట్ ఆడటానికి, ప్రేక్షకుల అనుమతికి అంగీకరిస్తుందో ఆ వేదికలనే ఐపీఎల్ కోసం ఎంపిక చేయాలని అనుకుంటున్నది. ఇప్పటికే ఐపీఎల్ కోసం చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ నగరాలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి అంగీకరించాయి. అంతే కాకుండా ప్రేక్షకుల విషయంలో కూడా నిబంధనలు సడలించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాయి. దీంతో బీసీసీఐ ఈ ఐదు నగరాలను ఐపీఎల్ వేదికలుగా ప్రాథమికంగా నిర్ణయించింది. హైదరాబాద్, ముంబయి, మొహలీ నగరాల్లో ఇంకా కోవిడ్ నిబంధనల కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు. ముఖ్యంగా ముంబయిలో ఇటీవల కోవిడ్ కేసులు పెరగడంతో అక్కడ మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో బీసీసీఐ ఆ మూడు నగరాలను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్‌పై పూర్తి నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నది.
వేదికల నిర్ణయంపై స్టార్ ఒత్తిడి..
ఐపీఎల్ వేదికల నిర్ణయంపై బ్రాడ్‌కాస్టర్ స్టార్ గ్రూప్ కూడా ఒత్తిడి చేస్తున్నది. ఏప్రిల్ 11న ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో ఒక నెల ముందుగానే తమకు పూర్తి వేదికలు, షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. స్టార్ గ్రూప్‌కు ఇచ్చిన ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు ఈ ఏడాదితో పూర్తి కానున్నాయి. దీంతో ఈ సీజన్ ద్వారా సాధ్యమైనంత ఆదాయాన్ని సంపాదించాలని స్టార్ కూడా భావిస్తున్నది. అడ్వర్టైజింగ్ మొదలు కావాలంటే ముందుగా వేదికలు నిర్ణయించాలి. అందుకే స్టార్ గ్రూప్ కూడా బీసీసీఐపై ఒత్తిడి తెస్తున్నది. ప్రస్తుతం ప్రాథమికంగా నిర్ణయించిన ఐదు వేదికలతో పాటు మిగతా వేదికలను కూడా సిద్ధం చేయాలని స్టార్ అనధికారికంగా బీసీసీఐని కోరింది. మరోవైపు ఆ మూడు గ్రౌండ్ల ఫ్రాంచైజీలు కూడా ఆయా రాష్ట్రప్రభుత్వాలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ ప్రభుత్వాలు కనుక క్రికెట్ ఆడటానికి అనుమతులు ఇస్తే ఐపీఎల్ 14వ సీజన్ గతంలో లాగానే 8 వేదికల్లో జరిగే అవకాశం ఉన్నది.