- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమిండియా క్రికెటర్లకు గుడ్‌న్యూస్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ మూడు వారాల సెలవు ప్రకటించింది. వరుసగా బయోబబుల్‌లో ఉంటూ క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంగా ఈ సెలవులు మంజూరు చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌లో ఉన్న క్రికెటర్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత కుటుంబాలతో కలసి విశ్రాంతి తీసుకోవడానికి 20 రోజుల సెలవులు ఇచ్చింది. ఫైనల్ పూర్తయిన తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కావడానికి 40 రోజుల అంతరం ఉన్నది. అందుకే జూన్ 24 నుంచి జులై 14 వరకు టీమ్ ఇండియా క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో తమకు ఇష్టమైన ప్రదేశాలు తిరగడానికి అనుమతి ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి చెప్పారు.
అయితే బ్రిటన్‌లో అమలులో ఉన్న పూర్తి కోవిడ్-19 ఆంక్షలను పాటిస్తూ తమ సెలవులు గడపాలని బీసీసీఐ సూచించింది. సెలవుల అనంతరం జులై 14న తిరిగి క్రికెటర్లు అందరూ బయోబబుల్‌లోకి ప్రవేశించాలని బీసీసీఐ చెప్పింది. అయితే బబుబ్‌లోకి వచ్చే ముందు మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని బీసీసీఐ వెల్లడించింది.