- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్పత్రి నుంచి దాదా డిశ్చార్జ్.. రెస్ట్ తీసుకోవాలన్న డాక్టర్లు
దిశ,వెబ్‌డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం కోల్ కత్తాకు చెందిన ఓ ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. కాగా జనవరి తొలివారంలో గంగూలీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు దాదా గుండె రక్తనాళ్లాల్లో మూడు చోట్ల పూడికలు గుర్తించారు. యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ వేశారు. ఆరోగ్యం కుదుట పడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ తరువాత మరో మారు గుండె నొప్పి రావడంతో డాక్టర్లు టెస్ట్ లు చేసి ఒత్తిడి కారణంగా రక్తనాళాల్లో పూడికలు ఏర్పడ్డాయని, వాటిని తొలగించి మరో స్టెంట్ వేసినట్లు డాక్టర్ దేవీ శెట్టి, డాక్టర్ అశ్విన్ మెహతాలతో కూడిన వైద్య బృందం తెలిపింది. గురువారం రాత్రి వరకూ ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకున్న దాదాను ఆ తరువాత సాదారణ వార్డ్‌కు తరలించారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం కుదుట పడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరికొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.