హోంక్వారంటైన్‌లో సౌరవ్ గంగూలీ

by Anukaran |   ( Updated:2020-07-16 07:41:36.0  )
హోంక్వారంటైన్‌లో సౌరవ్ గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ బుధవారం హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. అతని సోదరుడు, క్యాబ్ జాయింట్ సెక్రటరీ స్నేహాశిష్ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు సౌరవ్‌ను క్వారంటైన్‌కు వెళ్లమని సూచించారు. దీంతో దాదా తన కుటుంబంతో సహా కోల్‌కతాలోని స్వగృహంలోనే ఉంటున్నారు. స్నేహాశిష్ భార్య, అత్తమామలకు తొలుత కొవిడ్-19గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి స్నేహాశిష్ తమ పూర్వీకుల ఇంటిలో వచ్చాడు. ఇదే ఇంట్లో సౌరవ్ గంగూలీ ఉంటున్నాడు. బుధవారం స్నేహాశిష్‌కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అతన్ని బెల్లె వ్యూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సౌరవ్ గంగూలీని హోమ్ క్వారంటైన్ చేశారు. మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన స్నేహాశిష్ ప్రస్తుతం సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అతని భార్య, అత్తమామలతో కలసి మోమిన్‌పూర్‌లో నివసిస్తున్నాడు.

Advertisement

Next Story