- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఐపీఎల్ నిర్వహించుకునే హక్కు బీసీసీఐకి ఉంది'
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించుకోవాలో తేల్చుకునే సర్వహక్కులు బీసీసీఐకి ఉన్నాయని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ అన్నారు. టీ20 ప్రపంచ కప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఐసీసీపై ఒత్తిడి తెచ్చి ఐపీఎల్ కోసమే టీ20 ప్రపంచ కప్ వాయిదా వేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హోల్డింగ్ స్పందించాడు. బీసీసీఐ అలా ఒత్తిడి తెచ్చి టీ20ని వాయిదా వేయిస్తుందని తాను భావించట్లేదని చెప్పాడు. కరోనా ప్రభావం కారణంగా ఆస్ట్రేలియా విధించిన నిబంధనల మేరకే టీ20 వాయిదా వేస్తున్నట్లు మాత్రం తెలుసన్నారు. ఇక బంతిపై మెరుపు రాబట్టడానికి ఉమ్మిని నిషేధించడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బంతిపై మెరుపు కోసం కాస్త తేమ అవసరం. దానికి ఉమ్మినే వాడాల్సిన అవసరం లేదు. కానీ స్వింగ్ కోసం బౌలర్లు మరింత కష్టపడాల్సి రావొచ్చని ఆయన అన్నారు.