- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత అన్న చందంగా ప్రచారాలు, ఆర్భాటల కోసం జిల్లాలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రస్తుతం వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని బీసీ సంక్షేమ సంఘం నాయకులు యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వనపర్తి జిల్లాలో కరోనా మహమ్మరిని కట్టడి చేశామని, జిల్లాను గ్రీన్ జోన్‌లో నిలిపామని జిల్లాకు చెందిన మంత్రి గొప్పలకు పోతున్నారని అన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా రెండు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రగల్బాలు పలికి, ఒక్కసారి కూడా మంత్రి ఐసోలేషన్ సెంటర్ల పరిస్థితి పరిశీలించ లేదని, ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని రాచాల హితవు పలికారు. రోజురోజుకూ కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన జిల్లా మంత్రి, జిల్లా వైద్యాధికారులు, సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు, రోగులకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు.