‘గాడ్ ఫాదర్’ ఆన్ ది వే.. #BB3 టైటిల్‌పై చర్చ

by Jakkula Samataha |
Balakrishna
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా, లెజెండ్’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. థర్డ్ ఫిల్మ్ #BB3 టైటిల్ గురించి సినిమా ప్రారంభం నుంచే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రోమో.. బోయపాటి-బాలయ్య మార్క్‌ యాక్షన్ సీక్వెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌కు కొదవలేకుండా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా సినిమా ఉంటుందని చెప్తుండగా.. లేటెస్ట్‌గా ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ఫైనల్ అయినట్లు సమాచారం. ఇండస్ట్రీ ‘గాడ్ ఫాదర్’ ఆన్ ది వే అంటూ #GodFatherను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిన ఫ్యాన్స్.. ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయింది, మే 28న బాలయ్య బాక్సాఫీస్‌ వసూళ్లకు విట్‌నెస్‌గా మారిపోయేందుకు రెడీగా ఉండమని చెప్తున్నారు.

Advertisement

Next Story