- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PUBG లవర్స్ ఇది మీకోసమే.. రూ. కోటి గెలిచే అవకాశం
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా పబ్‌జీ గేమ్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ ఇండియాలో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఆ గేమ్‌ను భారత ప్రభుత్వం నిషేధించగా, ఏడాది తర్వాత బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ (BGMI) పేరుతో భారత్‌లో మళ్లీ లాంచ్ అయింది. కొన్ని మార్పులు చేర్పులతో ప్రత్యేకంగా ‘ఇండియా వెర్షన్’తో మార్కెట్లోకి వచ్చిన ఈ గేమ్ అనుకున్నట్లుగానే కొత్త రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే దీనికి మరింత బూస్టప్ ఇవ్వడానికి క్రాఫ్టన్ ‘బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్-2021’ తాజాగా ప్రకటించింది.
పబ్‌జీ నిషేధించకముందు 2020లో ‘పబ్‌జీ మొబైల్ లైట్ చాంపియన్‌షిప్’తో టోర్నమెంట్ నిర్వహించారు. ఆ సమయంలో 5 లక్షల ప్రైజ్‌మనీ అందించగా, తాజా బీజీఎమ్‌ఐ నిర్వహిస్తున్న 2021-సిరీస్‌లో ఏకంగా కోటి రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంది. బీజీఎమ్‌ఐ అధికారికంగా విడుదలైన తర్వాత క్రాఫ్టన్ నిర్వహిస్తు్న్న మొదటి ఎస్పోర్ట్స్ టోర్నమెంట్ ఇదే. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్ కూడా ఏర్పాటు చేసింది. మొత్తం 16 జట్లు ఇందులో పాల్గొంటాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జూలై 19 నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు నెలల పాటు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది.
ఇన్-గేమ్ క్వాలిఫైయర్స్, ఆన్‌లైన్ క్వాలిఫైయర్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ అండ్ ఫైనల్లీ గ్రాండ్ ఫైనల్స్ అనే ఐదు దశలు ఉంటాయి. ఇన్-గేమ్ క్వాలిఫైయర్స్ ఆగస్టు 2 నుంచి ప్రారంభమై ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. ఆన్‌లైన్ క్వాలిఫైయర్స్ ఆగస్టు 17 – సెప్టెంబర్ 12, క్వార్టర్ ఫైనల్స్ సెప్టెంబర్ 16 – 26, సెమీ ఫైనల్స్ సెప్టెంబర్ 30- అక్టోబర్ 3 మధ్య జరగనుండగా, గ్రాండ్ ఫైనల్స్ అక్టోబర్ 7న మొదలై అక్టోబర్ 10తో ముగుస్తుంది. ఆటగాళ్ళు ఇన్-గేమ్ క్వాలిఫయర్స్ సమయంలో తమ రిజిస్టర్డ్ జట్టుతో 15 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, క్వాలిఫైయర్స్‌లో 1024 జట్లు ఎంపికచేస్తారు. అందులోంచి 64 జట్లు క్వార్టర్స్, 24 టీమ్స్ సెమీ ఫైనల్స్‌కు, 16 జట్లు గ్రాండ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
రూ. 1 కోటి రూపాయల క్యాష్ ప్రైజ్ 16 జట్ల మధ్య విభజిస్తారు.
మొదటి ప్రైజ్ – రూ. 50 లక్షలు
రెండో ప్రైజ్ – రూ. 25 లక్షలు
మూడో ప్రైజ్ – రూ. 10 లక్షలు
నాలుగో స్థానం – రూ. 3లక్షలు
ఐదు – రూ. 2లక్షలు
ఆరు – రూ. 1,50,000
ఏడు – రూ. 1,00,000
ఎనిమిది- రూ. 90,000
తొమ్మిది – రూ. 80,000
అంతేకాదు మరికొన్ని విజయాలకు బహుమతులు కూడా ఉన్నాయి. ఎంవీపీ ఆఫ్ టోర్నమెంట్‌కు రూ. 1,00,000, లోన్ రేంజర్‌కు రూ. 50,000, రాంపేజ్ ఫ్రీక్‌కు రూ. 50,000, స్వ్కాడ్ విత్ మోస్ట్ ఫినిషెస్‌కు రూ. 50,000 అండ్ రిడీమర్‌కు రూ. 50,000.
ఇందులో పాల్గొనే ఆటగాళ్ళు భారతదేశంలోనే ఉండాలి. వారి ర్యాంక్.. ప్లాటినం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.