మహిళలకు శుభవార్త.. బతుకమ్మ చీరలొచ్చాయ్..

by Sridhar Babu |   ( Updated:2021-10-01 04:52:31.0  )
మహిళలకు శుభవార్త.. బతుకమ్మ చీరలొచ్చాయ్..
X

దిశ, వెల్గటూర్: మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకునే దసరా పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా అందజేస్తుంది. ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో మహిళల కోసం 83, 860 చీరలను ఆయా మండలాలకు పంపించారు అధికారులు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ చీరలను అందజేయనున్నారు. వెల్గటూర్ మండలంలో 30 గ్రామాలు ఉండగా.. 15,880 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించాలనే లక్ష్యంతో వెల్గటూర్‌కు 19,307 చీరలను పంపించారు. ఈ మేరకు ఎంపీడీవో సంజీవ రావు, తహసీల్దార్ రాజేందర్, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్ తదితరుల ఆధ్వర్యంలో అధికారులు అన్ని గ్రామాలకు ట్రాక్టర్‌లలో చీరలు పంపించారు. ఈ నెల 2 నుంచి పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు, వీఆర్ఏలు, మహిళా సంఘాల నాయకులు గ్రామాలలో ఈ చీరలను పంపిణీ చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed