- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరెంట్ బిల్లు కట్టలేని స్థితిలో బాసర ట్రిపుల్ ఐటీ
దిశ, బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. విద్యాలయ నిర్వహణకు, ఉద్యోగుల వేతనాలకు, చివరికి విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు సైతం నిధులు లేక బకాయిలు పేరుకుపోయాయి. ట్రిపుల్ ఐటీ నిర్వహణ కొరకు ప్రతి ఏడాది 6 కోట్ల నిధులు అవసరం ఉంటుంది. ఇందులో ఉద్యోగుల వేతనాలకు 2 కోట్లు కావాలి. విద్యుత్ బిల్లు నెలకు సుమారు 30 లక్షల వరకు ఉంటుంది. మిగతా నిధులు విద్యాలయ నిర్వహణ, తదితర ఖర్చులకు సరిపోతాయి. ప్రస్తుతం విద్యాలయానికి చెందిన బ్యాంక్ ఖాతాలో 24 వేలే ఉండడం విద్యాలయ పరిస్థితిని తెలిపింది.
విద్యాలయం ఏర్పడిన తొలినాళ్లలో అప్పటి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కానీ, గత మూడేళ్ల నుండి రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాలయానికి నిధుల కేటాయింపు తగ్గుతూ వస్తున్నది. కేటాయించిన నిధులలో సైతం కోత విధిస్తోంది ప్రభుత్వం. విద్యాలయానికి సుమారు 40 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ నిధులు ఉన్నాయి. విద్యాలయ భవిష్యత్తు అవసరాల కోసం వాటిని ముట్టుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఏటా వచ్చే నిధులు మరియు విద్యార్థుల నుంచి ఫీజుల ద్వారా విద్యాలయ నిర్వహణ జరుగుతున్నది. విద్యార్థుల నుంచి వచ్చే ఫీజుల ద్వారా ఏటా విద్యాలయానికి సుమారు 18 కోట్ల నిధులు సమకూరుతాయి. కరోనా కారణంగా విద్యాలయం మూసి ఉండడం, తరగతుల నిర్వహణ లేకపోవడంతో విద్యార్థుల ఫీజులు ఆగిపోయాయి. ఆర్థిక వనరులు నిండిపోవడంతో విద్యాలయం పలు రకాలు బకాయిలు పెరిగిపోతున్నాయి. జూన్ చివరి నాటికి విద్యాలయ విద్యుత్ బకాయిలు కోటి పది లక్షలు వరకు ఉన్నాయి. విద్యార్థులు లేకపోయినా రాత్రివేళలో విద్యాలయంలో విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. అయినా ఈ విషయంలో అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం కరుణిస్తేనే విద్యాలయానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పుతాయి.