- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీ వలలో బాన్సువాడ రూరల్ సీఐ
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ సీఐ చామంతుల టాటా బాబు ఏసీబీకి చిక్కాడు. తన సర్కిల్ పరిధిలోని నస్రూల్లాబాద్ పోలిస్ స్టేషన్ లో నమోదైన ఒక భూ వివాధం కేసులో కాంట్రాక్టర్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకుంటు అవినితి నిరోధక శాఖకు దొరికాడు.
నస్రూల్లా బాద్ మండలం ఆంకోల్ తాండాకు చెందిన ప్రతాప్ సింగ్ నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా టాటాబాబును అతని నివాసంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కాగా ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి పై ఆగస్టు 20న బాన్సువాడ రూరల్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. దానితో అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి టాటా బాబు రూ.50 వేలు డిమాండ్ చేశారు. కాని చివరకు రూ.20 వేలకు ఒప్పుకున్నాడు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం అందిచారు. వారి సూచన మేరకు తొలి దఫాలో రూ.10 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు బాన్సువాడ రూరల్ సర్కిల్ పోలిస్ స్టేషన్ లో, టాటా బాబు నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చెపట్టారు.